• deviantART: Popular Models Photography
    deviantART RSS for boost:popular in:photography models


  • 1 2 3 4 5 6 7 8 9 10
  • అంతర్జాతీయ
    వార్తలు > వార్తలు > అంతర్జాతీయ


    • బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన కత్తి ధర రూ.20 లక్షలు...
      అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధ్యక్షుడు దివంగత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు ఉపయోగించిన కత్తిని వేలం పాటలో 20 లక్షల రూపాయల ధర పలికింది.

    • ఒబామా ఆహ్వానం : సెప్టెంబర్‌లో అమెరికాకు మన్మోహన్
      అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చే సెప్టెంబర్ నెలలో అమెరికాకు వెళ్లనున్నారు. ఇరుదేశాల దౌత్య సంబంధాల అభివృద్ధి కోసం ఈ అధికారిక చేపట్టనున్నారు.

    • సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే మైత్రీ బంధం: చైనాకు తెగేసి చెప్పిన భారత్!
      సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటేనే రెండు దేశాల మధ్య మైత్రీ బంధం పెంపొందుతుందని చైనాకు భారత్ స్పష్టం చేసింది. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని లీ కెక్వియాంగ్‌‌తో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం రాత్రి విస్తృత భేటీ జరిపారు.

    • మహీందా రాజపక్సే : అందుకే తమిళ సమాజం పతనం దిశగా?
      తమిళ మైనారిటీలు శ్రీలంకలోనే ఉండాలని ఆకాంక్షిస్తుంటే.. తమిళ పార్టీలు, ప్రవాసులు మాత్రం వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని అధ్యక్షుడు మహింద రాజపక్సే మండిపడ్డారు. ఎల్టీటీఈ శకానంతరం తమిళ ప్రజలు లంకలోనే శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నారని తెలిపారు. ఎల్టీటీఈతో దశాబ్దాల తరబడి సాగిన పోరాటం ముగిసి నాలుగేళ్ళు పూర్తయ్యాయి.

    • సరిహద్దు సమస్య : భారత్-చైనాల మధ్య చర్చ.. భారత్‌కు లీ
      భారత్-చైనాల మధ్య గల సరిహద్దు సమస్య పట్ల ఇరుదేశాల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఉభయ దేశాల మధ్య ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ దేశాల మధ్య ఆర్థిక సహకారం నిరాఘాటంగా సాగుతున్నది. ఆసియాలో చైనాను నియంత్రించడానికి భారత్‌ను అమెరికా ఉపయోగించుకుంటున్నదని చైనా భావిస్తోంది. భారతదేశం - చైనా ఏకకాలంలో అభివృద్ధి చెందనిది ఆసియా ఖండం సంపద్వంతం కాదు' - లీ కెకియాంగ్‌ గత మార్చి 15న 'నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌'చే ప్రధానమంత్రిగా ఎన్నుకొనబడిన 57 ఏళ్ల లీ కెకియాంగ్‌ (ఈయన పేరును లీ ఖూ చాంగ్‌గా పలుకుతారు) తన మొట్టమొదటి విదేశీ పర్యటనగా భారతదేశంలో వచ్చే ఆదివారం అడుగిడబోతున్నారు.

    • జపాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు
      జపాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 డిగ్రీలు నమోదైన ఈ భూకంపంవల్ల ఎటువంటి ప్రాణ నష్టం కలిగినట్లు సమాచారం అందలేదు. జపాన్‌లో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం తీవ్రతగా 5.9 డిగ్రీలుగా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది.

    • 50 మంది భారత జాలర్ల విడుదలకు పాకిస్థాన్ సంసిద్ధత
      తమ దేశంలోని వివిధ జైళ్ళలో మగ్గుతున్న భారత జాలర్లలో 51 మందిని విడుదల చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సమ్మతం తెలిపింది. సౌహార్ద్రపూర్వక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్‌ కూడా ఇదే విధంగా స్పందిస్తుందన్న నమ్మకం తమకుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

    • ఫ్రాన్స్‌లో గే వివాహాల బిల్లుపై హోలాండే సంతకం!
      ఫ్రాన్స్‌లో ఇకపై గే వివాహాలు జరుగనున్నాయి. ఈ దేశంలో స్వలింగ వివాహాలకు ఆ దేశ ప్రెసిడెంట్ హోలాండే ఆమోముద్ర వేశారు. దీంతో ఫ్రాన్స్‌లో ఇకమీదట మగాళ్లు, మగాళ్లను పెళ్లాడొచ్చు. ఆడాళ్లు, ఆడాళ్లతో కలిసి జీవితాన్ని పంచుకునే వెసులుబాటు కలుగనుంది.

    • కాశ్మీర్ ఇంద్రనీలం ధర రూ.20 కోట్లు : లండన్‌లో వేలం
      ది స్టార్ ఆఫ్ కాశ్మీర్‌గా పిలిచే కాశ్మీర్ ఇంద్రనీలం డైమండ్ ధర రూ.20 కోట్లు పలికింది. ఇది డాలర్లలో 3,483,017 డాలర్లన్నమాట. 19.88 క్యారెట్ల కుషన్ షేప్డ్ (చతురస్రాకారంలో ఉండే) ఇంద్రనీలం రికార్డు స్థాయిలో ధర పలకడంతో భారతీయ వజ్రాల ధరలకు ఏమాత్రం తిరుగులేదని తేలింది.

    • దుబాయ్‌లో ఉత్తమ డ్రైవర్‌గా ఎంపికైన రాష్ట్రవాసి
      దుబాయ్‌లో ఉత్తమ డ్రైవర్‌గా ఆంధ్రప్రదేశ్‌ వాసి ఎంపికయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన రాజారెడ్డి అల్లూరి అనే వ్యక్తి దుబాయ్ ఎయిర్‌పోర్టులో గత నాలుగేళ్ళుగా ట్రాక్టర్ డ్రైవర్‌గా ఎంపికయ్యాడు. ప్రతి ఏడాది దుబాయ్ విమానాశ్రయం తమ సంస్థకు చెందిన డ్రైవర్లలో అత్యంత సురక్షితంగా వాహనం నడిపేవారికి సురక్షితమైన డ్రైవర్ అవార్డు ప్రకటిస్తుంది. ఈ యేడాడి మన రాష్ట్రానికి చెందిన రాజాడ్డి అల్లూరికి ఈ అవార్డు దక్కింది.

    {literal} {/literal}